News26th Oct 05:44 PMSunil Byrisetty1 min read

తిరుపతిలో పోలీస్ ఆయుధాల అవగాహన ప్రదర్శన – ఓపెన్ హౌస్

పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా తిరుపతి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో “పోలీస్ ఆయుధాల అవగాహన ప్రదర్శన ఓపెన్ హౌస్” కార్యక్రమాన్ని పోలీస్ పెరేడ్ మైదానంలో జిల్లా ఎస్పీ ఎల్.

తిరుపతిలో పోలీస్ ఆయుధాల అవగాహన ప్రదర్శన – ఓపెన్ హౌస్
పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా తిరుపతి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో “పోలీస్ ఆయుధాల అవగాహన ప్రదర్శన ఓపెన్ హౌస్” కార్యక్రమాన్ని పోలీస్ పెరేడ్ మైదానంలో జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ప్రారంభించారు. ఎస్పీ మాట్లాడుతూ పోలీసు శాఖలో ఉపయోగించే వివిధ రకాల ఆయుధాలు, భద్రతా పరికరాలు, కమ్యూనికేషన్ సిస్టమ్స్, ఫోరెన్సిక్ సామగ్రి వంటివి ఎలా పనిచేస్తాయో, అవి ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగిస్తామో విద్యార్థులు ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. యువతలో పోలీస్ వ్యవస్థపై అవగాహన, విశ్వాసం పెంపొందించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం అన్నారు. పోలీసు వ్యవస్థ ప్రజల భద్రత కోసం 24 గంటలూ కృషి చేస్తుందన్నారు. పౌరులు కూడా చట్టానికి సహకరించాలనే బాధ్యతతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సమాజంలో శాంతి భద్రతల కోసం పోలీసులు, ప్రజలు కలిసి పనిచేయాలని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమం ఏడు రోజులపాటు జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల్లో నిర్వహించినట్లు చెప్పారు.
Andhra Pradesh
Tirupati
Police Department
SP L. Subbarayudu
Police Martyrs Remembrance Day
Weapons Exhibition
Open House
Student Awareness
Police Equipment
విద్యార్థుల అవగాహన
పోలీస్ పరికరాలు
ఫోరెన్సిక్ సామగ్రి
కమ్యూనికేషన్ సిస్టమ్స్
Scroll for the next article