Politics7th Aug 11:22 AMSunil Byrisetty1 min read
అలా వెళ్లి.. తిరిగి వైసీపీలోకి విజయసాయి?
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పొలిటికల్ రీ-ఎంట్రీకి చూస్తున్నారు. ఈ మేరకు ఆయనే సోషల్ మీడియాలో ప్రకటించారు. అయితే ఆయనకు వైసీపీ తప్ప మరో ఆప్షన్ ఉందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏపీ రాజక
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పొలిటికల్ రీ-ఎంట్రీకి చూస్తున్నారు. ఈ మేరకు ఆయనే సోషల్ మీడియాలో ప్రకటించారు. అయితే ఆయనకు వైసీపీ తప్ప మరో ఆప్షన్ ఉందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏపీ రాజకీయ చదరంగంలో ఆయన ముందున్న మార్గాలు అత్యంత పరిమితమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎన్డీయే భాగస్వామ్య పక్షాల్లో బీజేపీ తప్ప వేరే అవకాశం లేదు. గతంలో కొత్త పార్టీ పెడతానని వ్యాఖ్యానించినప్పటికీ.. ఆయన అంత ధైర్యం చేస్తారని ఎవరూ అనుకోవడం లేదు. ఇంక ఆయనకు వైఎస్సార్సీపీయే ఏకైక ప్రత్యామ్నాయం. వైసీపీకి కూడా ఢిల్లీలో లాబీయింగ్ చేయడానికి విజయసాయికి మించిన ఆప్షన్ లేదంటున్నారు. కనుక ఆయన రీ ఎంట్రీ సొంతగూటికేనని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.