National10th Nov 03:17 PMSunil Byrisetty1 min read
ఆత్మకథ.. ప్రజలన్నీ మర్చిపోలేదు!
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆత్మకథ ‘బిలాంగింగ్ : ఏ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకంలో 2004 ఎన్నికల తర్వాత ప్రధాని పదవి చేపట్టడం గురించి అటువంటి ఓ అందమైన అబద్దం చె
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆత్మకథ ‘బిలాంగింగ్ : ఏ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకంలో 2004 ఎన్నికల తర్వాత ప్రధాని పదవి చేపట్టడం గురించి అటువంటి ఓ అందమైన అబద్దం చెప్పుకున్నారు.
ఆమె ప్రధాని పదవి చేపట్టకూడదని ముందే కచ్చితంగా నిర్ణయించుకున్నప్పటికీ మిత్ర పక్షాల ఒత్తిడి తట్టుకోలేక ఓకే చెప్పినట్లు రాసుకున్నారు. ఆ సమయంలో తాను తీవ్ర ఒత్తిడికి లోనయినట్లు ఆత్మకథలో పేర్కొన్నారు. కానీ దేశ ప్రజలకు వాస్తవాలు తెలియవని, తెలిసున్నా గుర్తుండవని అనుకోవడం ఉద్దేశపూర్వక విస్మరణే అవుతుంది. ఇటలీ దేశస్తురాలైన ఆమె ప్రధాని పదవి చేపట్టడంపై కాంగ్రెస్ సీనియర్ నేతలు శరత్ పవార్, పీఏ సంగ్మా, తారిక్ అన్వర్ తీవ్ర అభ్యంతరాలు తెలిపారు. అందుకే వారిని పార్టీ నుంచి బహిష్కరించింది చరిత్రలో ఉంది. బీజేపీకి చెందిన సుష్మా స్వరాజ్, ఉమా భారతి, జనతా పార్టీకి చెందిన సుబ్రహ్మణ్య స్వామి తదితరులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అంతే కాకుండా ఆమె భారతీయ పౌరసత్వంపై సుప్రీంకోర్టులో కేసు కూడా నడిచింది. అయితే సుప్రీంకోర్టు వాటిని కొట్టేసినప్పటికీ, పార్టీలో, బయట ఊహించని విధంగా ఇంత వ్యతిరేకత ఎదురవడంతో సోనియా గాంధీ వెనక్కు తగ్గారు. డా. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పటికీ, ఎటువంటి అధికారిక పదవిలో లేని సోనియా గాంధీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేశారని నేటికీ తెలంగాణ కాంగ్రెస్ నేతలు గొప్పగా చెప్పుకోవడమే ఆమె దేశాన్ని ఏలారనేందుకు ఉదాహరణ అని అందరికీ తెలుసు.