Politics21st Aug 02:09 PMSunil Byrisetty1 min read

బీసీల రాజకీయ హక్కులు బీసీలకే దక్కాలి

స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో బీసీలకు 34 శాతం, పట్టణ స్థానిక సంస్థల్లో 33.33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని బీజే

బీసీల రాజకీయ హక్కులు బీసీలకే దక్కాలి
స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో బీసీలకు 34 శాతం, పట్టణ స్థానిక సంస్థల్లో 33.33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రొంగల గోపి శ్రీనివాస్ అన్నారు. బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచే ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో బీసీలకు స్థానిక సంస్థల్లో తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. గతంలో అమలులో ఉన్న బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గించడం వల్ల బీసీల రాజకీయ ప్రాతినిధ్యం దెబ్బతిన్నదన్నారు. ఆ సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా బెదిరింపులు, అక్రమాలు, దౌర్జన్యాల మధ్య జరిగాయని విమర్శించారు. బీసీ సమాజం ఎన్నో దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న రాజకీయ హక్కులను ఓటుబ్యాంక్ రాజకీయాల కోసం ఇతర వర్గాలకు కేటాయించడం సరికాదని గోపి శ్రీనివాస్ అన్నారు.
Andhra Pradesh politics
BC Reservations
Political Rights of BCs
34% BC Reservation
Urban BC Reservation
Local Body Elections
BJP OBC Morcha
బీజేపీ
టీడీపీ
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు
బీసీ రాజకీయ ప్రాతినిధ్యం
స్థానిక సంస్థలు
బీసీ సంక్షేమం
Scroll for the next article