Politics6th Mar 10:05 AMSunil Byrisetty1 min read

ప్రకాశంలో బాలినేని Vs రియాజ్

మాజీ మంత్రి జనసేన నేత బాలినేని పై సంచలన వ్యాఖ్యలు చేసిన జిల్లా అధ్యక్షుడు రియాజ్. జిల్లాలో బాలినేని వ్యవహార శైలి వల్లే జనసేన పార్టీ రెండు వర్గాలుగా ఏర్పడింది. పార్టీలోచేరే ముందు ఒక

ప్రకాశంలో బాలినేని Vs రియాజ్
మాజీ మంత్రి జనసేన నేత బాలినేని పై సంచలన వ్యాఖ్యలు చేసిన జిల్లా అధ్యక్షుడు రియాజ్. జిల్లాలో బాలినేని వ్యవహార శైలి వల్లే జనసేన పార్టీ రెండు వర్గాలుగా ఏర్పడింది. పార్టీలోచేరే ముందు ఒక జిల్లా అధ్యక్షడుగా ఉన్న తనకు బాలనేని కనీసం సమాచారం ఇవ్వడంగాని తనతో చర్చించడంగాని చేయలేదు. ఒక విలువలు, వ్యక్తిత్వంగల వ్యక్తిగా ఉన్న తనను బాలినేని అవమానించాడు. అందుకే వ్యక్తిత్వంపై నిలబడిన వ్యక్తిని కాబట్టే బాలినేనితో నేను కలవలేదు ఇకపై ముందుకూడా నాకైనేను కలిసేది లేదు. మాపార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ అదేసిస్తే తప్ప జిల్లాలో బాలినేనితో కలిసి నడిచే పరిస్థితే లేదు. బాలినేని అనుచరులు జిల్లా కమిటీలో సభ్యులుగా చేరినా మేము పార్టీ ఆవిర్బావం నుండి రాష్ట కమిటీలో సభ్యులుగా ఉన్నాం. పార్టీ ఆవిర్భావంనుండి పార్టీ సిద్దాంతాలు పవన్ కళ్యాణ్ విధానాలు నచ్చి పార్టీలో చేరాము ఆ సిద్దాంతాలకు అనుగునంగా పార్టీ ఆవిర్భావం నుండి నడుచుకుంటున్న వ్యక్తులం మేము.
Balineni srinivasa reddy
Riyaz Ap news
Ap politics
బాలినేని శ్రీనివాస రెడ్డి
రియాజ్ ఏపీ వార్తలు
ఏపీ రాజకీయాలు
Scroll for the next article