Politics22nd Jul 12:35 PMSunil Byrisetty1 min read
ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక!
అనారోగ్య కారణాలతో ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధనఖడ్ రాజీనామా చేయడంతో రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో త్వరలోనే తదుపరి ఉపరాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాను
అనారోగ్య కారణాలతో ఉపరాష్ట్రపతి పదవికి
జగదీప్ ధనఖడ్ రాజీనామా చేయడంతో రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో త్వరలోనే తదుపరి ఉపరాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. కొత్తగా ఎన్నికయ్యే వ్యక్తి పూర్తి ఐదేళ్లపాటు పదవిలో ఉంటారు. నిబంధనల ప్రకారం, ఉపరాష్ట్రపతి పదవీ కాలం పూర్తయితే 60 రోజుల్లోగా ఎన్నిక నిర్వహించాలి. ఈ పదవికి పోటీ చేయాలంటే కనీసం 20 మంది ఎంపీలు ప్రతిపాదన చేయాలి. ఈసారి ఎన్నికల్లో ఎన్డీఏ, ఇండి కూటముల మధ్య గట్టిపోటీ ఉండనుందని భావిస్తున్నారు.