News13th Dec 11:30 AMSunil Byrisetty1 min read
పొందూరు ఖాదికి జి.ఐ. టాగ్ కేటాయింపు
శ్రీకాకుళం జిల్లాలో పుట్టి ప్రపంచ ఖ్యాతి సాధించిన పొందూరు ఖాదికి మళ్ళీ పూర్వ వైభవం సాధించి పెట్టేందుకు రామ్మోహన్ నాయుడు తీవ్రంగా కృషి చేశారు. ఆ కృషి ఫలితంగానే పొందూరు ఖాదికి భౌగోళి
శ్రీకాకుళం జిల్లాలో పుట్టి ప్రపంచ ఖ్యాతి సాధించిన పొందూరు ఖాదికి మళ్ళీ పూర్వ వైభవం సాధించి పెట్టేందుకు రామ్మోహన్ నాయుడు తీవ్రంగా కృషి చేశారు. ఆ కృషి ఫలితంగానే పొందూరు ఖాదికి భౌగోళిక గుర్తింపు ప్రకటిస్తూ వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ పరిధిలోని భోగోళిక సూచికల రిజిస్ట్రీ అధికారిక పత్రాన్ని జారీ చేసింది. ఒక్కో ప్రాంతంలో తయారయ్యే లేదా ఉత్పత్తి అయ్యే కొన్ని రకాల వస్తువులకు సహజంగా ఒక నాణ్యత ఉంటుంది. అదే వాటి ప్రత్యేకతగా నిలుస్తుంది.. ఆ విశిష్టతను దృష్టిలో ఉంచుకొని.. వాటికి మరింత ప్రాధాన్యత ఇచ్చే విదంగా "ది జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్ (రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్) యాక్ట్ 1999 ను ఏర్పాటు చేశారు. ఈ చట్టం క్రింద ఒక ప్రత్యేకమైన భౌగోళిక ప్రాంతంనుంచి వచ్చే ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్ ఇండికేషన్) వర్తిస్తుంది.తద్వారా మిగిలిన ఉత్పత్తుల కన్నా, మేలైనవిగా, విలువైనవిగా భౌగోళిక గుర్తింపు పొందిన వస్తువులు నిలుస్తాయి. ఇందుకోసం భోగోళిక సూచికల రిజిస్ట్రీ అనేక దఫాలుగా క్షేత్ర స్థాయి పరిస్థితులను అధ్యయనం చేస్తుంది. నాణ్యతని అన్ని దశల్లో పరీక్షిస్తుంది. ప్రజల్లో ఉన్న ఆదరణను సైతం పరిగణలోకి తీసుకుంటుంది. అయితే మన దేశంలో అనేక విలువైన, అంతరించిపోయే దశలో అనేక ఉత్పత్తులు ఉన్నప్పటికీ చాలా కొద్ది వస్తువులు మాత్రమే ఈ తరహా భౌగోళిక గుర్తింపు సాధించగా.. అందులో పొందూరు ఖాదీకి జి.ఐ టాగ్ లభించడం వెనుక.. అప్పట్లో శ్రీకాకుళం ఎంపిగా, ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న కింజరాపు రామ్మోహన్ నాయుడు విశేష కృషి చేశారు.