News25th Jun 11:56 AMSunil Byrisetty1 min read

పేదల ఇంటి నిర్మాణానికి అనుమతులు రూపాయికే!

పేదలకు ఇంటి నిర్మాణ అనుమతుల ఖర్చులు భారం కాకుండా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పట్టణాల్లో 50 చదరపు మీటర్ల విస్తీర్ణంలో పేదలు నిర్మించుకునే ఇళ్లకు రూపాయికే ఇక అనుమతులు ఇవ్వనున్న

పేదల ఇంటి నిర్మాణానికి అనుమతులు రూపాయికే!
పేదలకు ఇంటి నిర్మాణ అనుమతుల ఖర్చులు భారం కాకుండా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పట్టణాల్లో 50 చదరపు మీటర్ల విస్తీర్ణంలో పేదలు నిర్మించుకునే ఇళ్లకు రూపాయికే ఇక అనుమతులు ఇవ్వనున్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన మంత్రివర్గ సమావేశం నగరాలు, పట్టణాల్లో భవన నిర్మాణాల నిబంధనల్లో సవరణలను ఆమోదించింది. 100 చదరపు మీటర్ల (ప్లాట్‌) స్థలంలో నిర్మాణాలకు 2 మీటర్ల వెడల్పుగల అంతర్గత రోడ్డు, 100 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న ప్లాట్లకు 3.6 మీటర్ల వెడల్పుతో అంతర్గత రోడ్డు సరిపోతుంది. 500 చదరపు మీటర్లు మొదలుకుని 2,500 చదరపు మీటర్ల విస్తీర్ణం ఉన్న ప్లాట్లకు ఫ్రంట్‌ సెట్‌బ్యాక్‌ 3 మీటర్ల నుంచి ఇంచుమించు 5.5 మీటర్లు, అదే విధంగా భవనంలో మిగిలిన మూడు వైపులకు ఇప్పటివరకు ఉన్న పాత నిబంధనలే వర్తిస్తాయి. అయితే తడి, పొడి వ్యర్థాల నిర్వహణ మాత్రం ప్రతి భవనంలోనూ తప్పనిసరి చేశారు.
Andhra Pradesh news
Cm chandra babu
CONSTRUCTION OF HOUSES FOR THE POOR
construction permission for one rupee
పేదల ఇళ్ల నిర్మాణం రూ1కే అనుమతులు
Scroll for the next article