Crime8th Mar 11:46 AMSunil Byrisetty1 min read

పోసానిపై 17వ కేసు నమోదు

సినీ నటుడు, దర్శకుడు, వైసీపీ సానుభూతిపరుడు పోసాని కృష్ణమురళిపై రాష్ట్రవ్యాప్తంగా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వారి కుటుంబ సభ్యులపై గత ప్రభ

పోసానిపై 17వ కేసు నమోదు
సినీ నటుడు, దర్శకుడు, వైసీపీ సానుభూతిపరుడు పోసాని కృష్ణమురళిపై రాష్ట్రవ్యాప్తంగా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వారి కుటుంబ సభ్యులపై గత ప్రభుత్వంలో పోసాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పోసానిపై వరుస కేసులు నమోదు అవుతుండటంతోపాటు అరెస్ట్ కూడా అయ్యారు. పలు స్టేషన్లలో నమోదైన కేసుల విచారణ కోసం పీటీ వారెంట్లతో రాష్ట్రమంతా పోలీసులు తిప్పుతున్నారు. తాజాగా జనసేన నేత శంకర్ ఫిర్యాదుపై భవానీపురం పీఎస్ లో 17వ కేసు నమోదైంది. క్రైమ్ నెంబర్ 657/2024 ప్రకారం ఐపీసీ 153, 153a, 354A1, 502(2), 505(1)(C) సెక్షన్ల కింద కేసును పోలీసులు నమోదు చేశారు.
Narasarao peta
Posani Arrest
Posani Krishna Murali
నరసరావుపేట
పోసాని అరెస్ట్
పోసాని కృష్ణమురళి
Scroll for the next article