News23rd Mar 09:13 AMSunil Byrisetty1 min read
పోసాని బూతులకు తాళం పడినట్లే
గత వైసీపీ ప్రభుత్వంలో నోటికి హద్దు, అదుపు లేకుండా బూతులతో రెచ్చిపోయిన నటుడు పోసాని కృష్ణమురళి ఇకపై అలా ప్రవర్తించరేమో. ఎఫ్డీసీ చైర్మన్‌గా పదవి వచ్చాక ఏకంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్
గత వైసీపీ ప్రభుత్వంలో నోటికి హద్దు, అదుపు లేకుండా బూతులతో రెచ్చిపోయిన నటుడు పోసాని కృష్ణమురళి ఇకపై అలా ప్రవర్తించరేమో.
ఎఫ్డీసీ చైర్మన్‌గా పదవి వచ్చాక ఏకంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ కుటుంబాలను సైతం బజారుకీడ్చేలా వ్యాఖ్యలు చేశారు.
దీనిపై అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు బాలకోటయ్య స్పందిస్తూ ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుందన్నారు.
అలాగే బూతులను మాత్రమే నమ్ముకున్న పోసాని కృష్ణమురళి వంటి వ్యక్తులకు జైలు జీవితం పరిష్కారం చూపిస్తోందని బాలకోటయ్య వ్యాఖ్యానించారు.
ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్ట్ ట్వీట్ చేశారు. ఇక భవిష్యత్తులో పోసాని ఏ నాయకుడిపై కానీ, ఏ మహిళలపై కానీ బూతులు మాట్లాడలేరని చెప్పారు.
జైలు జీవితం ఆయనకు కనువిప్పు కలిగి ఉంటుందన్నారు.
పోసాని నోటిని కోల్ గేట్ పేస్ట్‌తో కేసులు శుభ్రపరిచి ఉంటాయని చెప్పారు.
పోసాని పాఠాన్ని గుణపాఠంగా తీసుకుని సోషల్ మీడియాలో రెచ్చిపోయో పిచ్చి కుక్కలు తెల్లవారుజామునే కోల్ గేట్ తో పళ్ళు తోముకుని, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీడియా ముందుకు వస్తారని బాలకోటయ్య అభిప్రాయపడ్డారు.