Politics19th Dec 11:44 AMSunil Byrisetty1 min read
పదవులు, హోదా కాదు బాధ్యత ముఖ్యమన్న జనసేనాని
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ తరఫున నామినేటెడ్ పదవులు పొందిన నేతలకు స్పష్టమైన మార్గనిర్దేశం చేయనున్నారు. డిసెంబర్ 22న ‘పదవి–బాధ్యత’ పేరుతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ తరఫున నామినేటెడ్ పదవులు పొందిన నేతలకు స్పష్టమైన మార్గనిర్దేశం చేయనున్నారు. డిసెంబర్ 22న ‘పదవి–బాధ్యత’ పేరుతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాజకీయ పదవులు హోదా, దర్పం ప్రదర్శించడానికి కాదని, ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన బాధ్యత అని ఆయన స్పష్టం చేయనున్నారు. కూటమి ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులు పొందిన జనసేన నేతలంతా ఈ సమావేశానికి హాజరుకానున్నారు. పదవుల దుర్వినియోగం రాజకీయంగా నష్టం కలిగిస్తుందని, పారదర్శక పాలనతోనే ప్రజల్లో విశ్వాసం నిలబెట్టుకోవచ్చని పవన్ వివరించనున్నారు. ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో సమర్థంగా అమలు చేయడమే లక్ష్యంగా పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆయన పిలుపునివ్వనున్నారు.