Politics8th Jan 01:32 PMSunil Byrisetty1 min read
6 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు!?
ఏపీలో వైసీపీకి చెందిన కనీసం ఆరుగురు ఎమ్మెల్యేల సభ్యత్వంపై అనర్హత వేటు పడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే ఆరు స్థానాలకు ఉపఎన్నికలు వచ్చే వీలుందని రాజకీయ వర్గాల్లో చర్చ
ఏపీలో వైసీపీకి చెందిన కనీసం ఆరుగురు ఎమ్మెల్యేల సభ్యత్వంపై అనర్హత వేటు పడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే ఆరు స్థానాలకు ఉపఎన్నికలు వచ్చే వీలుందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుండానే జీతభత్యాలు, అలవెన్సులు తీసుకుంటున్న ఎమ్మెల్యేల వ్యవహారంపై శాసనసభ ఎథిక్స్ కమిటీ ఇప్పటికే సీరియస్ అయింది. ఎథిక్స్ కమిటీ సమావేశంలో చైర్మన్ మండలి బుద్ధప్రసాద్ నేతృత్వంలో వైసీపీ ఎమ్మెల్యేల గైర్హాజరీపై కీలక చర్చ జరిగింది. నిబంధనల ప్రకారం, స్పీకర్ అనుమతి లేకుండా వరుసగా 60 రోజుల పాటు సభకు హాజరుకాకపోతే సదరు సభ్యత్వంపై అనర్హత వేటు వేసే అధికారం సభకు ఉంటుంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల నాటికి ఈ 60 రోజుల గడువు పూర్తి కానుండటంతో, వారి సభ్యత్వాన్ని రద్దు చేయాలని కమిటీ సిఫారసు చేసే అవకాశం ఉంది. దీంతో ఉపఎన్నికలకు రంగం సిద్ధమవుతుందనే ప్రచారం జరుగుతోంది.