Business Type28th Jun 04:53 PMSunil Byrisetty1 min read
పోస్టాఫీసుల్లో డిజిటల్ చెల్లింపులు
డిజిటల్ చెల్లింపులు దేశవ్యాప్తంగా పెరిగిపోయిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని అన్ని పోస్టాఫీసులూ ఆగస్టు 1 నుంచి డిజిటల్ చెల్లింపులను స్వీకరించనున్నాయి.
డిజిటల్ చెల్లింపులు దేశవ్యాప్తంగా పెరిగిపోయిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని అన్ని పోస్టాఫీసులూ ఆగస్టు 1 నుంచి డిజిటల్ చెల్లింపులను స్వీకరించనున్నాయి. పోస్టల్ విభాగంలో IT నూతన మౌలిక సదుపాయాలు అందుబాటు లోకి వచ్చిన తర్వాత, డిజిటల్ చెల్లింపులకు వీలవుతుందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం పోస్టాఫీసులు UPI వ్యవస్థతో అనుసంధానం కాలేదు. ఈ నేపథ్యంలో డైనమిక్ QR కోడ్ ద్వారా లావాదేవీలు నిర్వహించే విధంగా కొత్త అప్లికేషన్ తీసుకొస్తున్నామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.