News21st Nov 12:09 PMSunil Byrisetty1 min read
ముగిసిన 'పోస్ట్ పరాఖ్ రాష్ట్రీయ సర్వేక్షన్ 2024' వర్క్‌షాప్
స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (SCERT), పరాఖ్ (PARAKH), సమగ్ర శిక్ష సంయుక్త ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరిగిన "పోస్ట్ పరాఖ్ రాష్ట్రీయ సర్వేక్షన్ 2024 – డిస
స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (SCERT), పరాఖ్ (PARAKH), సమగ్ర శిక్ష సంయుక్త ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరిగిన "పోస్ట్ పరాఖ్ రాష్ట్రీయ సర్వేక్షన్ 2024 – డిస్సెమినేషన్ అండ్ ట్రైనింగ్ ఆన్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ (HPC)" వర్క్‌షాప్ గురువారంతో ముగిసింది. విజయవాడలోని ఓ హోటల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి సమగ్ర శిక్ష స్టేట్ అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ కె. నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ శిక్షణా కార్యక్రమం ఆవశ్యకతను, లక్ష్యాలను, HPC ని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాల్సిన విధానాలను విశ్లేషించారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి దోహదపడేలా HPC ని సక్రమంగా వినియోగించుకోవాలని, ప్రభుత్వ పాఠశాలల ఉన్నతికి అధికారులు, ఉపాధ్యాయులు సమర్థవంతంగా పర్యవేక్షణ నిర్వహించాలన్నారు. శిక్షణలో నేర్చుకున్న నైపుణ్యాలను పాఠశాల స్థాయి వరకు తీసుకెళ్లి, వాటిని ఆచరణలో పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీఈఆర్టీ, సమగ్ర శిక్ష సిబ్బంది పాల్గొన్నారు. ఈ శిక్షణ ద్వారా పొందిన నైపుణ్యాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన విద్యా విధానం (NEP 2020) లక్ష్యాలను చేరుకోవడానికి, విద్యా ప్రమాణాలను పెంచడానికి దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.