Jobs31st Dec 03:49 PMSunil Byrisetty1 min read
ప్రభుత్వాసుపత్రుల్లో 784 మంది స్పెషలిస్టులకు పోస్టింగులు
సెకండరీ/టీచింగ్ ఆసుపత్రుల్లో సీనియర్ రెసిడెంటు (ఎస్.ఆర్)గా ఏడాదిపాటు పనిచేసేలా పీజీ మెడికల్ వైద్యులకు పోస్టిoగులు ఇచ్చినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడ
సెకండరీ/టీచింగ్ ఆసుపత్రుల్లో సీనియర్ రెసిడెంటు (ఎస్.ఆర్)గా ఏడాదిపాటు పనిచేసేలా పీజీ మెడికల్ వైద్యులకు పోస్టిoగులు ఇచ్చినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడిoచారు మానవ ప్రమేయం లేకుండా ఆన్ లైన్ కౌన్సిలింగ్ ద్వారా మొత్తం 23 డిపార్ట్మెంట్స్ ల్లో పోస్టింగులు ఇచ్చినట్లు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. పోస్టింగులు పొందిన వైద్యులు జనవరి 5వ తేదీలోగా సదరు ఆసుపత్రుల్లో విధుల్లో జాయిన్ కావాలని స్పష్టం చేసారు. 2022-23 విద్యా సంవత్సరంలో రాష్ట్ర కన్వీనర్ కోటాలో, ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలలో ప్రవేశాలు పొంది. పీజీ పూర్తిచేసిన వైద్యులు ఏడాదిపాటు తప్పనిసరిగా ప్రాంతీయ, సామాజిక, జిల్లా, బోధనాసుపత్రుల్లో పనిచేసే విధానం అమల్లోనికి వచ్చింది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ గత వారం జారీచేసిన నోటిఫికేషన్ అనుసరించి కన్వీనర్ కోటాలో 784 మంది ప్రవేశాలు పొందారు. ప్రస్తుతం వైద్యులకు అందచేసిన పోస్టింగు ఉత్తర్వుల్లోనే ఆరునెలల అనంతరం ఏ ఆసుపత్రిలో పనిచేయాలో కూడా స్పష్టంగా తెలిపినట్లు పేర్కొన్నారు. నాన్ క్లినికల్ వైద్యులు బోధనాసుపత్రుల్లోనే పనిచేయాలి.