Jobs22nd Oct 10:15 AMSunil Byrisetty1 min read

6 వేల పోలీసు ఉద్యోగాలకు త్వరలో పోస్టింగ్‌లు

కూటమి ప్రభుత్వం భర్తీ చేసిన 6 వేల పోలీసు ఉద్యోగాలకు త్వరలోనే పోస్టింగులు ఇవ్వనున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమం

6 వేల పోలీసు ఉద్యోగాలకు త్వరలో పోస్టింగ్‌లు
కూటమి ప్రభుత్వం భర్తీ చేసిన 6 వేల పోలీసు ఉద్యోగాలకు త్వరలోనే పోస్టింగులు ఇవ్వనున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో పోలీసు నియామకాల ఆవశ్యకత ఎంతో ఉందని అభిప్రాయపడ్డారు. గత ఐదేళ్ల పాలనలో పోలీసు శాఖలో నియామకాలు చేపట్టలేదని మంత్రి విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 6 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేసిందని, వీరికి త్వరలోనే నియామక పత్రాలు అందిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు అందరూ కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.
Andhra Pradesh
Police Recruitment
Job Postings
Achchennaidu
AP Government
Law and Order
Police Department
ఏపీ ప్రభుత్వం
శాంతిభద్రతలు
పోలీసు శాఖ
Scroll for the next article