Business Type25th Aug 01:16 PMSunil Byrisetty1 min read

పోస్టాఫీసుల్లో మ్యూచువల్ ఫండ్స్..

తపాలా శాఖతో మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల అసోసియేషన్‌ (యాంఫి) ఒప్పందం చేసుకుంది. పోస్టల్‌ శాఖకు చెందిన లక్ష మంది పోస్ట్‌మ్యాన్‌లకు మ్యూచువల్‌ ఫండ్స్‌పై శిక్షణ ఇవ్వనుంది. దీంతో మారుమూల

పోస్టాఫీసుల్లో మ్యూచువల్ ఫండ్స్..
తపాలా శాఖతో మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల అసోసియేషన్‌ (యాంఫి) ఒప్పందం చేసుకుంది. పోస్టల్‌ శాఖకు చెందిన లక్ష మంది పోస్ట్‌మ్యాన్‌లకు మ్యూచువల్‌ ఫండ్స్‌పై శిక్షణ ఇవ్వనుంది. దీంతో మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు మ్యూచువల్‌ ఫండ్స్‌ సేవలను తపాలా శాఖ ద్వారా చేరువ చేయొచ్చన్నది యాంఫి లక్ష్యంగా ఉంది. యాంఫి 30వ వ్యవస్థాపక దినం సందర్భంగా తపాలా శాఖ, యాంఫి ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి. మ్యూచువల్‌ ఫండ్స్‌ సేవలపై అవగాహనను విస్తృతం చేసేందుకు గాను నివేష్‌ కా సహి కదమ్, భారత్‌ నివేష్‌ రైల్‌ యాత్ర తదితర కార్యక్రమాలను ఈ సందర్భంగా యాంఫి ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఇన్వెస్టర్‌ క్యాంపుల నిర్వహణ, వందే భారత్‌ రైళ్లలో అవగాహన కార్యక్రమాలు చేపట్టనుంది.
India Post
Mutual Funds
AMFI
Postmen Training
Rural Investment
Financial Inclusion
Investor Awareness
Nivesh Ka Sahi Kadam
Bharat Nivesh Yatra
వందే భారత్ రైళ్లు
ఇన్వెస్టర్ అవగాహన
పోస్టాఫీసులు
Scroll for the next article