News15th Oct 05:33 PMSunil Byrisetty1 min read

లా సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలి

యోగివేమన విశ్వవిద్యాలయం పరిధిలో టైమ్ టేబుల్ ఇచ్చారని ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు పరీక్షలు వాయిదా వేయాలని DYFI జిల్లా అధ్యక్ష

లా సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలి
యోగివేమన విశ్వవిద్యాలయం పరిధిలో టైమ్ టేబుల్ ఇచ్చారని ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు పరీక్షలు వాయిదా వేయాలని DYFI జిల్లా అధ్యక్ష కార్యదర్శి ముడియం చిన్ని,వీరణాల శివకుమార్ కోరారు. కడపలో వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రతి పౌరుడు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం బాధ్యత అని చెబుతుంటే దానికి విరుద్ధంగా యోగివేమన విశ్వవిద్యాలయం అధికారులు దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. యూనివర్సిటీ అధికారులు కనీస విషయ పరిజ్ఞానం కూడా లేకుండా ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చిన సందర్భంలో స్థానిక ఎన్నికల వాతావరణం ఇప్పటికే రాష్ట్రంలో మొదలైందని మరి దారుణంగా 28 పోలింగ్ అని ఎన్నికల కమిషన్ చెబితే ఆరోజు కూడా లా పరీక్ష ఉందని షెడ్యూల్ పెట్టడం దారుణం అన్నారు. విద్యార్థులు తమ ఓటు హక్కును సైతం వినియోగించుకోకుండా యూనివర్సిటీ అధికారుల చర్యలు ఉన్నాయని అన్నారు. అధికారులు కనీసం సమస్య వినడానికి కూడా సమయం లేనంత పనిలో ఉన్నారా అని ప్రశ్నించారు.ఈ 2,4 లా సెమిస్టర్ పరీక్షలు నిర్వహణ పై యూనివర్సిటీ అధికారులు పునరాలోచించాలని ఎన్నికల నేపధ్యంలో పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు.
Scroll for the next article