News3rd Sep 03:48 PMSunil Byrisetty1 min read

ఫాదర్ ఆఫ్ లింగ్విస్టిక్ స్టేట్స్ పొట్టి శ్రీరాములు

ప్రాణత్యాగం చేసి కోట్లాది మంది తెలుగువారి దారిచూపిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అని, పొట్టి శ్రీరాములు స్మృతివనం ఏర్పాటుకు అన్ని విధాల సహకారం అందిస్తామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా

ఫాదర్ ఆఫ్ లింగ్విస్టిక్ స్టేట్స్ పొట్టి శ్రీరాములు
ప్రాణత్యాగం చేసి కోట్లాది మంది తెలుగువారి దారిచూపిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అని, పొట్టి శ్రీరాములు స్మృతివనం ఏర్పాటుకు అన్ని విధాల సహకారం అందిస్తామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం, అమరజీవి పొట్టి శ్రీరాములు మొమోరియల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో అమరావతిలోని తుళ్లూరు-పెదపరిమి మధ్య ప్రభుత్వం కేటాయించిన 6.8 ఎకరాల విస్తీర్ణంలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహంతో పాటు ఆడిటోరియం, స్మృతివనం నిర్మాణానికి మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. అనంతరం అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళలు అర్పించారు. జ్యోతి ప్రజ్వలన చేశారు. పొట్టి శ్రీరాములు గారిపై రూపొందించిన ఏవీని వీక్షించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మంత్రి లోకేష్ ప్రసంగిస్తూ.. వాసవీమాతాకి జై. మహాత్మాగాంధీ దేశానికి స్వాతంత్ర్యం సాధిస్తే.. పొట్టి శ్రీరాములు తెలుగుజాతికి గుర్తింపు సాధించిన వ్యక్తి అని కొనియాడారు. గాంధీని ఫాదర్ ఆఫ్ నేషన్ అంటే.. పొట్టి శ్రీరాములును ఫాదర్ ఆఫ్ లింగ్విస్టిక్ స్టేట్స్ అంటారని పేర్కొన్నారు.
Andhra Pradesh
Potti Sriramulu
Father of Linguistic States
Amaravati
Smritivanam
Bronze Statue
Nara Lokesh
మెమోరియల్ ట్రస్ట్
పొట్టి శ్రీరాములు
Scroll for the next article