TTD3rd Jan 11:54 AMSunil Byrisetty1 min read

నేడు పౌర్ణమి గరుడ సేవ

తిరుపతి శ్రీ గోవింద‌రాజ‌స్వామి, శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర స్వామివారి ఆల‌యాల‌లో నేడు పౌర్ణమి గరుడ సేవ నిర్వహిస్తున్నారు. తిరుప‌తి శ్రీ గోవింద‌రాజ‌స్వామి, శ్రీ‌నివాస‌మంగాపురం శ్రీ క‌

నేడు పౌర్ణమి గరుడ సేవ
తిరుపతి శ్రీ గోవింద‌రాజ‌స్వామి, శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర స్వామివారి ఆల‌యాల‌లో నేడు పౌర్ణమి గరుడ సేవ నిర్వహిస్తున్నారు. తిరుప‌తి శ్రీ గోవింద‌రాజ‌స్వామి, శ్రీ‌నివాస‌మంగాపురం శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర స్వామివారి ఆల‌యాల‌లో జ‌న‌వ‌రి 3న పౌర్ణమి గరుడసేవ వైభ‌వంగా జరుగనుంది. ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన టీటీడీ గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా సాయంత్రం 6 నుండి 8 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీ గోవింద‌రాజ‌స్వామి, గరుడునిపై ఆల‌య మాడ వీధులలో విహ‌రించి భక్తులకు దర్శనమిస్తారు. అలాగే శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు ఊంజల సేవ, రాత్రి 7 నుంచి 8 గంటల వరకు గరుడసేవ అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.
Pournami Garuda Seva
Tirupati
Govindaraja Swamy Temple
Kalyana Venkateswara Swamy Temple
Srinivasa Mangapuram
టీటీడీ
గరుడ వాహన సేవ
హిందూ పర్వదినం
Scroll for the next article