News24th Sep 03:38 PMSunil Byrisetty1 min read

స్థిరమైన ప్రభుత్వంతోనే పేదరికం నిర్మూలన

ఢిల్లీలో "పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా (PAFI)" 'ఫైర్ సైడ్ చాట్'లో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. స్థిరమైన ప్రభుత్వంతోనే పేదరికం నిర్మూలన అని వ్యాఖ్యానించారు. అగ్రికల్చర్ నుంచి మ్యా

స్థిరమైన ప్రభుత్వంతోనే పేదరికం నిర్మూలన
ఢిల్లీలో "పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా (PAFI)" 'ఫైర్ సైడ్ చాట్'లో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. స్థిరమైన ప్రభుత్వంతోనే పేదరికం నిర్మూలన అని వ్యాఖ్యానించారు. అగ్రికల్చర్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ వరకు స్పీడ్ ఏపీ కల్చర్ గా మారిందన్నారు. ప్రాజెక్టులను గ్రౌండింగ్ చేయడమే ప్రథమ ప్రాధాన్యత అని తేల్చి చెప్పారు. 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా ఏపీ మారాలనేది తన ఆకాంక్ష అన్నారు. క్వాంటంతో పాటు హార్టికల్చర్, ఆక్వాకల్చర్ కూడా ముఖ్యమేనని చెప్పారు. అక్టోబర్ 2న హార్టికల్చర్ మిషన్ ను ప్రారంభిస్తున్నామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
Scroll for the next article