News8th Aug 03:52 PMSunil Byrisetty1 min read
సీఎం పేషిలో ఐఏఎస్ ల కొట్లాట!
సీఎం పేషిలో ఇద్దరు ఐఏఎస్ లు గొడవ పడినట్లు తెలుస్తోంది. ఈ విషయం చంద్రబాబు దృష్టికి వెళ్లినా మౌనం వహిస్తున్నారని చర్చ జరుగుతోంది. సీఎంఓ లో పనిచేస్తున్న ఇద్దరు ఐఏఎస్ అధికారుల మధ్య "అధ
సీఎం పేషిలో ఇద్దరు ఐఏఎస్ లు గొడవ పడినట్లు తెలుస్తోంది. ఈ విషయం చంద్రబాబు దృష్టికి వెళ్లినా మౌనం వహిస్తున్నారని చర్చ జరుగుతోంది. సీఎంఓ లో పనిచేస్తున్న ఇద్దరు ఐఏఎస్ అధికారుల మధ్య "అధికారం" ఆధిపత్య పోరు జరుగుతోందట. అందులో ఒకరేమో చంద్రబాబుకు దగ్గరగా ఉంటారు.మరొకరేమో మంత్రి లోకేష్ సన్నిహితుడని చెబుతున్నారు. ఈ ఇద్దరు అధికారులు, సీఎంఓలో అధికారం ఆధిపత్యం కోసం పోటీ పడుతూ, ఒకరిపై, మరొకరు బురద చల్లు కుంటున్నారని సచివాలయంలో ప్రచారం జరుగుతోంది. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. మాజీ సీఎం జగన్ అభిమాన ఐఏఎస్ అధికారులు కు.. కీలక, ప్రాధాన్యత పోస్టింగ్ లు ఇప్పించటంలో, ఈ ఇద్దరే పరస్పరం పోటీ బడుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.