News27th Dec 02:54 PMSunil Byrisetty1 min read

విజయవాడలో దుర్గగుడికి కరెంట్ కట్

విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానానికి కరెంట్ కట్ చేశారు. ఆలయానికి విద్యుత్‌ బిల్లుల బకాయిలు రూ.3.08 కోట్లుగా ఉన్నాయంటూ ఏపీసీపీడీసీఎల్‌ అధికారులు విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. 2023 ఫి

విజయవాడలో దుర్గగుడికి కరెంట్ కట్
విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానానికి కరెంట్ కట్ చేశారు. ఆలయానికి విద్యుత్‌ బిల్లుల బకాయిలు రూ.3.08 కోట్లుగా ఉన్నాయంటూ ఏపీసీపీడీసీఎల్‌ అధికారులు విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. 2023 ఫిబ్రవరి నుంచి బిల్లులు చెల్లించలేదని విద్యుత్‌ శాఖ చెబుతుండగా, బకాయిలపై పలుమార్లు నోటీసులు ఇచ్చినా స్పందన లేకపోవడంతో హెచ్‌టీ లైన్‌ నుంచి విద్యుత్‌ను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. ఈ చర్యపై దేవస్థానం భక్తుల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరింది. అయితే భక్తులకు ఇబ్బందులు కలగకుండా విద్యుత్‌ సేవలకు అంతరాయం లేకుండా జనరేటర్ల సాయంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది. అలాగే తమ సోలార్‌ ప్లాంట్‌ ద్వారా ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌ను వినియోగిస్తున్నామని పేర్కొంది.
Andhra Pradesh
Vijayawada
Kanaka Durga Temple
Power Cut
Electricity Disconnection
APCPDCL
Electricity Bills
₹3.08 Crore Dues
హెచ్‌టీ లైన్
జనరేటర్లు
సోలార్ విద్యుత్
భక్తులు
Scroll for the next article