News30th Oct 06:02 PMSunil Byrisetty1 min read

ఎల్లుండి ఉదయానికి ప్రతి ఇంటికి కరెంట్‌

నరసాపురం నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు రెండవ రోజు క్షేత్రస్థాయిలో పర్యటించారు. దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ప్రాణ, ఆస్తి నష్టాన్ని వీలైనంత తగ్గించామని, తుఫాన్‌పై ఎప్పటికప్పుడు సమ

ఎల్లుండి ఉదయానికి ప్రతి ఇంటికి కరెంట్‌
నరసాపురం నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు రెండవ రోజు క్షేత్రస్థాయిలో పర్యటించారు. దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ప్రాణ, ఆస్తి నష్టాన్ని వీలైనంత తగ్గించామని, తుఫాన్‌పై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించామని చెప్పారు. కలెక్టర్లు, అధికారులకు సూచనలు చేశామన్నారు. ఎక్కడా ఒక్క చెరువు తెగకుండా జాగ్రత్తపడ్డామన్నారు. 12,500 చెట్లు రోడ్లపై పడిపోతే క్లియర్‌ చేశామని, తెలంగాణ నుంచి విద్యుత్‌ సిబ్బంది వచ్చారని తెలిపారు. 4,500 విద్యుత్‌ స్తంభాలు కూలిపోయాయని, ఎల్లుండి ఉదయానికి ప్రతి ఇంటికి కరెంట్‌ ఇస్తామని పేర్కొన్నారు. ఫోన్‌ చేసిన వెంటనే అమిత్‌ షా స్పందించారని, రూ.4,600 కోట్ల నష్టపరిహారం కోసం రిపోర్ట్‌ పంపామని తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల సాయం అందిస్తామని, ఇళ్లలోకి నీరు వస్తే రూ.10 వేలు ఇస్తామని సీఎం వివరించారు.
Scroll for the next article