News15th Jul 12:24 PMSunil Byrisetty1 min read
విద్యుత్ చార్జీల తగ్గింపు పేరుతో మోసం: షర్మిల
విద్యుత్ చార్జీల తగ్గింపు పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి విమర్శించారు. ట్రూ అప్ పేరుతో వినియోగదారులపై భారీ భారం మోపిన ప్ర
విద్యుత్ చార్జీల తగ్గింపు పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి విమర్శించారు. ట్రూ అప్ పేరుతో వినియోగదారులపై భారీ భారం మోపిన ప్రభుత్వం, ట్రూ డౌన్ పేరుతో స్వల్ప తగ్గింపును చూపిస్తూ గొప్పలు చెప్పుకుంటోందన్నారు. రూ.15,485 కోట్ల మేర సర్దుబాటు చేసి, కేవలం రూ.923 కోట్ల మేర మాత్రమే తగ్గించి ప్రజలకు పెద్ద ఉపశమనం కల్పించినట్లు ప్రచారం చేయడం కూటమి ప్రభుత్వానికే చెల్లిందని ఆమె విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే చిత్తశుద్ధి ఉంటే, ఏటా కొన్ని పైసల తగ్గింపులు కాకుండా ట్రూ అప్ భారాన్ని పూర్తిగా తొలగించాలని డిమాండ్ చేశారు. గత రెండేళ్లుగా వినియోగదారుల నుంచి వసూలు చేసిన అదనపు మొత్తాన్ని తిరిగి చెల్లించాలని, అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు విద్యుత్ చార్జీలను 30 శాతం తగ్గిస్తూ వెంటనే నిర్ణయం తీసుకోవాలని షర్మిల ప్రభుత్వాన్ని కోరారు.