News23rd Sep 03:23 PMSunil Byrisetty1 min read

విద్యుత్ స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి రూ.5,500 కోట్ల‌తో ప‌నులు

గృహ‌, పారిశ్రామిక‌, వ్య‌వ‌సాయ అవ‌స‌రాల భ‌విష్య‌త్ డిమాండ్ తీర్చ‌డానికి ట్రాన్స్ కో ప‌రిధిలోని 68 ప్రాంతాల్లో రూ.5,500 కోట్ల‌తో వివిధ అభివృద్ధి ప‌నులు చేప‌ట్టామ‌ని ఇంధ‌న శాఖ మంత్రి

 విద్యుత్ స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి రూ.5,500 కోట్ల‌తో ప‌నులు
గృహ‌, పారిశ్రామిక‌, వ్య‌వ‌సాయ అవ‌స‌రాల భ‌విష్య‌త్ డిమాండ్ తీర్చ‌డానికి ట్రాన్స్ కో ప‌రిధిలోని 68 ప్రాంతాల్లో రూ.5,500 కోట్ల‌తో వివిధ అభివృద్ధి ప‌నులు చేప‌ట్టామ‌ని ఇంధ‌న శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ స్ప‌ష్టం చేశారు. విద్యుత్ స‌బ్ స్టేష‌న్ల‌కు సంబంధించి ఎమ్మెల్సీలు బీదా ర‌విచంద్ర యాద‌వ్, పేరాబ‌త్తుల రాజ‌శేఖ‌ర్, బీటీ నాయుడులు అడిగిన ప్ర‌శ్న‌కు శాస‌న మండ‌లిలో మంత్రి గొట్టిపాటి స‌మ‌ధానం చెప్పారు. ట్రాన్స్ కో చేప‌ట్టే వివిధ ప‌నులతో నెట్ వ‌ర్క్ ఓవ‌ర్ లోడ్ త‌గ్గడంతో పాటు లో ఓల్టేజ్ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డానికి అవ‌కాశం ఉంద‌ని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో 6 నుంచి 8 శాతం విద్యుత్ వినియోగం పెరుగుతుంద‌న్నారు. పెరుగుతున్న విద్యుత్ వినియోగానికి అనుగుణంగా, భ‌విష్య‌త్ అవ‌స‌రాల కోసం 14 ప్రాంతాల్లో స‌బ్ స్టేష‌న్ల నిర్మాణాల‌ను చేప‌డుతున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. ప‌నుల‌న్నీ పూర్త‌యితే లో ఓల్టేజ్ స‌మ‌స్య కూడా త‌గ్గుతుంద‌ని మంత్రి వెల్ల‌డించారు.
Andhra Pradesh
Transco
Electricity Network
Low Voltage
Industrial Growth
Future Demand
Energy Sector
Sub Stations
Energy Demand
Gottipati Ravikumar
విద్యుత్ సమస్యలు
విద్యుత్ వినియోగం
విద్యుత్ అభివృద్ధి పనులు
Scroll for the next article