News24th Dec 02:34 PMSunil Byrisetty1 min read

పోలవరం ప్రాజెక్ట్ లో పీపీఏ బృందం పర్యటన

పోలవరం ప్రాజెక్ట్ లో పీపీఏ బృందం పర్యటన చేపట్టింది. ప్రాజెక్ట్ నిర్మాణాన్ని సీఈఓ , ఇతర అధికారులు పరిశీలిస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సిఈఓ యోగేష్ పైతాన్కర్ నేతృత్వంలోని బృం

పోలవరం ప్రాజెక్ట్ లో పీపీఏ బృందం పర్యటన
పోలవరం ప్రాజెక్ట్ లో పీపీఏ బృందం పర్యటన చేపట్టింది. ప్రాజెక్ట్ నిర్మాణాన్ని సీఈఓ , ఇతర అధికారులు పరిశీలిస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సిఈఓ యోగేష్ పైతాన్కర్ నేతృత్వంలోని బృందం ప్రాజెక్ట్ లో నిర్మాణం జరుగుతున్న డయాఫ్రమ్ వాల్, గ్యాప్ 1, 2 ప్రాంతాలలో పర్యటిస్తోంది. పోలవరం ప్రాజెక్ట్ కు చేరుకున్న బృందానికి జలవనరుల శాఖ చీఫ్ ఇంజనీర్ కె నరసింహమూర్తి, ప్రాజెక్ట్ నిర్మాణ సంస్థ ఎం ఈ ఐ ఎల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సతీష్ బాబు స్వాగతం పలికారు. అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో సమావేశమైన బృందం సభ్యులు ఆ తరువాత పనుల పరిశీలన చేస్తున్నారు. పీపీఏ సిఈఓతో పాటు పోలవరంలో అథారిటీ సభ్య కార్యదర్శి ఎం రఘురాం, చీఫ్ ఇంజనీర్లు (పవర్) సి వి సుబ్బయ్య, ఎం రమేష్ కుమార్ (పీ అండ్ డి), డైరెక్టర్ కె శంకర్ పర్యటిస్తున్నారు.
Andhra Pradesh Irrigation
Diaphragm Wall
Polavaram Project
PPA Inspection
Polavaram Project Authority
Yogesh Paitankar
డయాఫ్రమ్ వాల్
గ్యాప్–1 గ్యాప్–2
ఎం ఈ ఐ ఎల్
మౌలిక వసతుల అభివృద్ధి
Scroll for the next article