News15th Jul 03:05 PMSunil Byrisetty1 min read
ప్రైవేటీకరణ కాదు.. పోర్టుల అభివృద్ధే లక్ష్యం
రాష్ట్ర ప్రభుత్వం పోర్టుల అభివృద్ధి, పారిశ్రామిక వృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, యువతకు ఉపాధి కల్పన అనే లక్ష్యాలతో అత్యంత పారదర్శకంగా అమలు చేస్తున్న Public-Private Partnership (PPP) విధ
రాష్ట్ర ప్రభుత్వం పోర్టుల అభివృద్ధి, పారిశ్రామిక వృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, యువతకు ఉపాధి కల్పన అనే లక్ష్యాలతో అత్యంత పారదర్శకంగా అమలు చేస్తున్న Public-Private Partnership (PPP) విధానంపై కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం అసత్య ప్రచారం చేయడం దురదృష్టకరమని మంత్రి బి.సి. జనార్ధన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రత్యేకించి రామాయపట్నం పోర్టును ప్రైవేటుకు అప్పగిస్తున్నారని, ప్రభుత్వ ఆస్తులను విక్రయిస్తున్నారని వైసీపీ చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు. ప్రజల్లో అపోహలు, భయాందోళనలు సృష్టించడం తప్ప దీనిలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. PPP అంటే ప్రైవేటీకరణ కాదు, ప్రభుత్వ ఆస్తులను విక్రయించడం కాదు, ప్రభుత్వ హక్కులను వదులుకోవడం అసలే కాదని స్పష్టం చేశారు. ప్రభుత్వ యాజమాన్యంలోని మౌలిక వసతులను మరింత సమర్థవంతంగా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, ప్రపంచస్థాయి ప్రమాణాలతో నిర్వహించేందుకు ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న పరిపాలనా విధానమే PPP అని వివరించారు. దేశంలోని విమానాశ్రయాలు, జాతీయ రహదారులు, మెట్రో రైలు వ్యవస్థలు, పారిశ్రామిక పార్కులు, ప్రధాన పోర్టులు సహా అనేక మౌలిక వసతుల ప్రాజెక్ట