Spiritual25th Nov 03:00 PMSunil Byrisetty1 min read

రాష్ట్ర పండుగగా జగ్గన్నతోట ప్రభల తీర్థ మహోత్సవం

డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండలం మొసలపల్లి గ్రామంలో ప్రతి ఏటా సంక్రాంతి సందర్భంగా నిర్వహించే "జగ్గన్నతోట ప్రభల తీర్థాన్ని" రాష్ట్ర పండుగగా

రాష్ట్ర పండుగగా జగ్గన్నతోట ప్రభల తీర్థ మహోత్సవం
డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండలం మొసలపల్లి గ్రామంలో ప్రతి ఏటా సంక్రాంతి సందర్భంగా నిర్వహించే "జగ్గన్నతోట ప్రభల తీర్థాన్ని" రాష్ట్ర పండుగగా గుర్తించేందుకు సీఎం చంద్రబాబు సమ్మతించారని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాజోలు పర్యటనలో ఉన్న మంత్రి కందుల దుర్గేష్ దృష్టికి కోనసీమ వాసులు ఈ అంశాన్ని తీసుకువచ్చి వినతి పత్రం అందించగా మంత్రి దుర్గేష్ స్పష్టతనిచ్చారు. తెలుగువారు పెద్ద పండుగగా జరుపుకునే సంక్రాంతిని పురస్కరించుకొని ఏటా లక్షలాది మంది భక్తుల కోలాహలం మధ్య అంగరంగ వైభవంగా జరిగే జగ్గన్న తోట ప్రభల తీర్థ మహోత్సవానికి ప్రత్యేకత ఉందన్నారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పర్యాటక మంత్రిగా తాను, సృజనాత్మక, సాంస్కృతిక సమితి ఛైర్ పర్సన్ తేజస్విని పొడపాటి వేర్వేరు సందర్భాల్లో 450 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రభల ఉత్సవాన్ని రాష్ట్ర పండుగగా గుర్తించాలని సీఎం దృష్టికి తీసుకెళ్లామని గుర్తుచేశారు. ఈ క్రమంలో ప్రభల తీర్థాన్ని త్వరలోనే పూర్తిస్థాయిలో రాష్ట్ర పండుగగా గుర్తించేందుకు సీఎం వెంటనే సమ్మతించారని స్పష్టం చేశారు. కోనసీమ వాసుల ఆకాంక్షను దృష్టిలో ఉంచుకొని కూటమి ప్రభుత్వం ప్రభల తీర్థాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించడం ఆనందంగా ఉందన్నారు.
Andhra Pradesh
State Festival
Konaseema
Prabala Teertham
Sankranti Celebrations
CM Chandrababu Naidu
అంబాజీపేట
సాంస్కృతిక వారసత్వం
పండుగ ప్రత్యేకం
Scroll for the next article