Entertainment29th Jul 04:27 PMSunil Byrisetty1 min read
'మహావతార నరసింహ' అద్భుతమన్న ప్రభాస్
పౌరాణిక కథనంపై రూపొందిన యానిమేషన్ చిత్రం 'మహావతార్ నరసింహ' ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాణసంస్థ హోంబలే ఫిల్మ్స్ ఈ విజువల్ వండర్‌ను నిర్మించింది. ఈ చిత్రం ప్రతి ఒక
పౌరాణిక కథనంపై రూపొందిన యానిమేషన్ చిత్రం 'మహావతార్ నరసింహ' ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాణసంస్థ హోంబలే ఫిల్మ్స్ ఈ విజువల్ వండర్‌ను నిర్మించింది. ఈ చిత్రం ప్రతి ఒక్కరి ప్రశంసలు పొందుతోంది. 3డీలో సరికొత్త అనుభూతిని పంచుతోంది. తాజాగా మూవీని చూసిన అగ్ర కథానాయకుడు ప్రభాస్ చిత్ర బృందాన్ని మెచ్చుకున్నారు. ‘పవర్‌ఫుల్ విజన్‌తో 'మహావతార నరసింహ'ను వాస్తవంలోకి తీసుకొచ్చిన హోంబలే ఫిల్మ్స్‌కు శుభాకాంక్షలు. సినిమా నాకెంతో నచ్చింది. యానిమేషన్ రూపంలో తీర్చిదిద్దిన యాక్షన్ సన్నివేశాలు, కథాగమనం అద్భుతంగా ఉన్నాయి. ఈ అపురూప విజయం సాధించిన దర్శకుడు అశ్విన్‌కుమార్, చిత్ర బృందానికి అభినందనలు'’ అని కొనియాడారు. మరోవైపు ప్రభాస్ పోస్ట్‌కు హోంబలే చిత్రబృందం స్పందించింది. సినిమాపై ఆయన అభిప్రాయంపై కృతజ్ఞతలు తెలిపింది.