Politics4th Jun 11:31 AMSunil Byrisetty1 min read

ప్రజాస్వామ్యం గెలిచిన రోజు

సరిగ్గా సంవత్సరం క్రితం ఇదే రోజున విధ్వంసపాలనపై ప్రజలు గెలిచారని విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అరాచక, కక్షపూరిత పాలనపై ప్రజా ఆకాంక్షలు ఘన విజయం సాధించాయన్నారు. ఈ

ప్రజాస్వామ్యం గెలిచిన రోజు
సరిగ్గా సంవత్సరం క్రితం ఇదే రోజున విధ్వంసపాలనపై ప్రజలు గెలిచారని విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అరాచక, కక్షపూరిత పాలనపై ప్రజా ఆకాంక్షలు ఘన విజయం సాధించాయన్నారు. ఈ గెలుపు ఐదు కోట్ల ప్రజల గెలుపు అని, ప్రజా తీర్పు కూటమి బాధ్యతను మరింత పెంచిందని తెలిపారు. చంద్రబాబు గారి పాలనానుభవం, పవనన్న ఆశయానికి మోదీ గారి ఆశీస్సులు పుష్కలంగా లభించడంతో ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం ప్రారంభమైందన్నారు. ప్రజా ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది. ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆశీర్వదించిన ఐదు కోట్ల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిపేందుకు ఇదే స్ఫూర్తితో మాకు అండగా నిలుస్తారని కోరుతున్నానన్నారు. ప్రజా తీర్పుదినం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
Andhra Pradesh news
ap politics
TDP
naralokesh
chandra Babu
PrajaTeerpuDinam
ప్రజాస్వామ్యం గెలిచిన రోజు
ప్రజా ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి
Scroll for the next article