News31st Jul 10:35 AMSunil Byrisetty1 min read
ప్రకాశం బ్యారేజీకి పెరుగుతున్న వరద ఉధృతి
విజయవాడలో ప్రకాశం బ్యారేజీకి గంట గంటకు వరద ఉధృతి పెరుగుతోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో కృష్ణా నదిలో నీటి మట్టాలు పెరిగాయి. దీంతో పైనుంచి వరద నీరు పోటెత్తుతోంది. మొదటి ప్రమాద హెచ
విజయవాడలో ప్రకాశం బ్యారేజీకి గంట గంటకు వరద ఉధృతి పెరుగుతోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో కృష్ణా నదిలో నీటి మట్టాలు పెరిగాయి. దీంతో పైనుంచి వరద నీరు పోటెత్తుతోంది. మొదటి ప్రమాద హెచ్చరిక దిశగా వరద పెరుగుతోంది. అందుకోసం 15 గేట్లను 7 అడుగులు మేర, 55 గేట్లను 6 అడుగుల మేర అధికారులు ఎత్తారు. మొత్తం ఇన్ ఫ్లో 2,77,784 క్యూసెక్కులుగా ఉంది. సముద్రంలోకి 2,60,875 క్యూసెక్కులు, కృష్ణా తూర్పు కాలువకు 10,187 క్యూసెక్కులు, కృష్ణా పశ్చిమ కాలువకు 6,522 క్యూసెక్కులు, గుంటూరు ఛానెల్ కు 200 క్యూసెక్కులు విడుదల కానుంది. బ్యారేజీ నీటిమట్టం 12 అడుగులుగా ఉంది.