News13th Aug 01:16 PMSunil Byrisetty1 min read
కృష్ణా నది పరివాహక మండలాలకు అలర్ట్
ప్రకాశం బ్యారేజీలో వరద ఉధృతి పెరుగుతున్న దృష్ట్యా అప్రమత్తంగా ఉండి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గీతాంజలి శర్మ అధిక
ప్రకాశం బ్యారేజీలో వరద ఉధృతి పెరుగుతున్న దృష్ట్యా అప్రమత్తంగా ఉండి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గీతాంజలి శర్మ అధికారులను ఆదేశించారు. జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ చాంబర్ నుంచి వరద పరిస్థితులపై క్షేత్రాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రకాశం బ్యారేజ్ ఎగువన భారీ వర్షాల కారణంగా ప్రకాశం నిన్న రాత్రి నుండి కృష్ణా నదికి వరద ప్రవాహం పెరుగుతుందన్నారు. ప్రకాశం బ్యారేజ్ లోకి 2.40 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహంపై నుంచి వస్తుందన్నారు. ఈ ప్రవాహం ఈరోజు సాయంత్రానికి 5 లక్షల క్యూసెక్కులకు చేరుకునే అవకాశం ఉందన్నారు.
మొదటి స్థాయి హెచ్చరిక కూడా ప్రకటించే అవకాశం ఉందన్నారు. కృష్ణా నది పరివాహక ప్రాంత మండల అధికారులు అప్రమత్తంగా ఉండి కాలువల పటిష్టతకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.