News30th Oct 12:20 PMSunil Byrisetty1 min read
ప్రకాశం జిల్లాలో ‘రాష్ట్రీయ ఏక్తా దివస్’
సర్దార్ వల్లభాయ్ పటేల్ 151వ జయంతిని పురస్కరించుకుని ‘రాష్ట్రీయ ఏక్తా దివస్’ వేడుకలను ప్రకాశం జిల్లా పోలీసులు ఘనంగా నిర్వహించారు. దేశ సమగ్రత, ఐక్యత కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన
సర్దార్ వల్లభాయ్ పటేల్ 151వ జయంతిని పురస్కరించుకుని ‘రాష్ట్రీయ ఏక్తా దివస్’ వేడుకలను ప్రకాశం జిల్లా పోలీసులు ఘనంగా నిర్వహించారు. దేశ సమగ్రత, ఐక్యత కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి యువతకు ఆదర్శప్రాయమని ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు అన్నారు.
దేశ సమగ్రత, ఐక్యత కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన సేవలు చిరస్మరణీయమని ప్రకాశం జిల్లా ఎస్పీ గారు కొనియాడారు. ఆయన ఆశయాలు, ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ అంకితభావంతో విధులు నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శుక్రవారం జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి జిల్లా ఎస్పీ గారు, అధికారులు మరియు సిబ్బంది పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. భారతదేశ గొప్ప నాయకుల్లో ఒకరైన, ‘ఉక్కు మనిషి’గా పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని ‘వేడుకలను "జాతీయ ఐక్యతా దినోత్సవం" గా జరుపుకుంటున్నామని తెలిపారు.