News6th May 12:31 PMSunil Byrisetty1 min read
టెన్నిస్ కోర్ట్‌ను ప్రారంభించిన ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్
పోలీస్ అధికారులు, సిబ్బంది శారీరక దృఢత్వం, మానసిక చురుకుదనం కలిగి ఉండటం అవసరమని ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. ఒంగోలు పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో నూతనంగా నవీకరించిన టెన్ని
పోలీస్ అధికారులు, సిబ్బంది శారీరక దృఢత్వం, మానసిక చురుకుదనం కలిగి ఉండటం అవసరమని ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు.
ఒంగోలు పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో నూతనంగా నవీకరించిన టెన్నిస్ కోర్ట్‌ను ఆయన ప్రారంభించారు.
విధి నిర్వహణలో నిత్యం ఒత్తిడికి గురయ్యే సిబ్బందికి శారీరక, మానసిక ఉల్లాసం ఎంతో అవసరమని, ఈ నవీకరించిన టెన్నిస్ కోర్ట్ పోలీసు సిబ్బందికి ఒక మంచి విరామ ప్రదేశంగా ఉపయోగపడుతుందని అన్నారు.
ఇది శారీరక దృఢత్వాన్ని పెంచడమే కాకుండా, మానసిక ఏకాగ్రతను, వ్యూహాత్మక ఆలోచనను కూడా మెరుగుపరుస్తుందని పేర్కొన్నారు.
సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులందరూ మానసిక, శారీరక ఆరోగ్యంతో ఉండాలని,ఎవరికైనా ఏదైనా ఆరోగ్య సమస్యలు, ఫిట్నెస్ సమస్య ఉన్నా తమను సంప్రదించవచ్చని, పోలీస్ క్లినిక్ డాక్టర్స్, ఫిట్నెస్ నిపుణుల సాయంతో తగిన సలహాలు ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు.