Politics11th Aug 05:43 PMSunil Byrisetty1 min read
ప్రకాష్ రాజ్ ఓటు పాయె.. ఫామ్ నింపారా సార్?
తన ఓటును తొలగించారంటూ ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ సోషల్ మీడియాలో వీడియో విడుదల చేశారు. ఆయన ఓటు పోవడానికి ప్రధాని మోదీ కారణమన్నట్లు విమర్శలు చేశారు. బెంగళూరులో తొలగించిన 65 లక్షల ఓట్ల
తన ఓటును తొలగించారంటూ ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ సోషల్ మీడియాలో వీడియో విడుదల చేశారు. ఆయన ఓటు పోవడానికి ప్రధాని మోదీ కారణమన్నట్లు విమర్శలు చేశారు. బెంగళూరులో తొలగించిన 65 లక్షల ఓట్లలో తాను ఒకడినని చెప్పారు. ఓటు వేయని వారి ఓట్లు తొలగించే అధికారం మీకు ఉండొచ్చు.. కానీ మిమ్మల్ని గద్దె దింపకుండా మమ్మల్ని ఆపగలరా అంటూ ప్రశ్నించారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చేపడుతున్న సమగ్ర ఓటర్ల సవరణ ప్రక్రియలో భాగంగా ప్రతీ ఓటరు డోర్-టు-డోర్ ఎన్యుమరేషన్ సర్వే ద్వారా సంబంధిత ఫారమ్ నింపి బీఎల్ఓకు అందించాల్సి ఉంటుంది. అయితే తాను ఫారమ్ నింపి ఇచ్చారా లేదా అనే విషయాన్ని పేర్కొనలేదు. గతంలో ప్రకాష్ రాజ్‌కు ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటర్ ఐడీలు ఉన్నాయనే వివాదంపై బెంగళూరు కోర్టు నుంచి నోటీసులు కూడా జారీ అయ్యాయి. అందుకే ఓటు తొలగించారా లేక ఫామ్ ఇవ్వక పోయిందా అనేది తేలాల్సి ఉంది.