Politics19th Aug 11:38 AMSunil Byrisetty1 min read

ఈసీపై ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు..

కేంద్ర ఎన్నికల సంఘంపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలింగ్ బూత్‌ల వద్ద సీసీటీవీ ఫుటేజీలను పారదర్శకంగా బయటపెట్టాలని డిమాండ్ చేశారు. మహిళల ప్రైవసీ కారణంగా సీసీటీవీ

ఈసీపై ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు..
కేంద్ర ఎన్నికల సంఘంపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలింగ్ బూత్‌ల వద్ద సీసీటీవీ ఫుటేజీలను పారదర్శకంగా బయటపెట్టాలని డిమాండ్ చేశారు. మహిళల ప్రైవసీ కారణంగా సీసీటీవీ ఫుటేజీ ఇవ్వలేమన్న ఎన్నికల కమిషన్ ప్రకటనపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. "పోలింగ్ కేంద్రాల్లో సీసీటీవీలు పెట్టే ముందు మహిళల అనుమతి తీసుకున్నారా? పోలింగ్ బూత్‌లు డ్రెస్ ఛేంజింగ్ రూమ్స్ కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసీ చెప్పే సాకులపై తమకు ఆసక్తి లేదని, తమకు కావాల్సింది పారదర్శకత అని ఆయన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. మరోవైపు ఇప్పటికే వోట్ చోరీ అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రకాష్ రాజ్ ఆయనతో గొంతు కలిపారు.
Indian Elections
Prakash Raj
Election Commission
CCTV Footage
Polling Booths
Transparency
Women Privacy
Rahul Gandhi
Vote Rigging
ఎన్నికల సంఘం
సీసీటీవీ ఫుటేజ్
Scroll for the next article