Politics12th Aug 03:09 PMSunil Byrisetty1 min read
ప్రకాశ్ రాజ్ ఓటు పోయిందా? ఇదిగో క్లారిటీ!
సినీ నటుడు ప్రకాశ్ రాజ్ తన ఓటును ఎన్నికల సంఘం తొలగించిందంటూ గగ్గోలు పెట్టారు. తనను టార్గెట్ చేసినట్లు వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రకాశ్ రాజ్ పేరును ఎలాంటి కారణం లేకుండా తొలగించలేదని
సినీ నటుడు ప్రకాశ్ రాజ్ తన ఓటును ఎన్నికల సంఘం తొలగించిందంటూ గగ్గోలు పెట్టారు. తనను టార్గెట్ చేసినట్లు వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రకాశ్ రాజ్ పేరును ఎలాంటి కారణం లేకుండా తొలగించలేదని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు.
SIRలో భాగంగా BLO పరిశీలనలో ఆయన నమోదైన చిరునామాలో నాలుగేళ్లుగా నివసించడం లేదని గుర్తించారు.
ప్రస్తుతం మరో చిరునామాలో నివసిస్తున్నట్లు ప్రకాశ్ రాజ్ స్వయంగా అధికారులకు తెలిపినట్లు పేర్కొన్నారు.
కొత్త చిరునామాలో ఓటు నమోదు చేసుకునేందుకు ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. అంటే ఓటు “తొలగింపు” కంటే పాత చిరునామా నుంచి “Shifted”గా గుర్తించినట్లు అధికారులు చెబుతున్నారు.