News6th Apr 10:55 AMSunil Byrisetty1 min read
కొమ్మమూరు లిఫ్ట్ కోసం.. ప్రసాద్ సీడ్స్ వితరణ
ముఖ్యమంత్రి పిలుపు మేరకు... పేదలకు చేయూతను అందించేలా పీ4 కార్యక్రమంలో భాగస్వాములు అయ్యేందుకు సంపన్నవర్గాలు ముందుకొస్తున్నాయి. ఈ క్రమంలో ఏకంగా సొంత నిధులతో ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజె
ముఖ్యమంత్రి పిలుపు మేరకు... పేదలకు చేయూతను అందించేలా పీ4 కార్యక్రమంలో భాగస్వాములు అయ్యేందుకు సంపన్నవర్గాలు ముందుకొస్తున్నాయి.
ఈ క్రమంలో ఏకంగా సొంత నిధులతో ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మించి ఇవ్వడానికి గుంటూరు జిల్లాలో ఒక పారిశ్రామిక వేత్త ముందుకు వచ్చారు.
గుంటూరు జిల్లా కాకమాను మండలంలో రైతులు సాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కొమ్మమూరు కెనాల్ ద్వారా నీటి సౌకర్యం ఉన్నా.. చివరి భూములకు నీరు అందడం లేదు. ఇక్కడ లిఫ్ట్ నిర్మిస్తే ఈ ప్రాంత రైతుల కష్టాలు తీరతాయి.
దీంతో ఈ సమస్యను పరిష్కరించడానికి పి4పై సిఎం ఇచ్చిన పిలుపును అందుకుని ప్రసాద్ సీడ్స్ అధినేత ప్రసాద్ ముందుకు వచ్చారు.
తమ సొంతూరులో రైతులు సాగునీటి ఎద్దడిని ఎదుర్కోవడం ప్రముఖ విత్తన తయారీ సంస్థ ‘ప్రసాద్ సీడ్స్’ యాజమాన్యాన్ని కదిలించింది.
సమస్య పరిష్కారం కోసం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మించేందుకు ప్రభుత్వంతో భాగస్వాములు అవుతామని ఈ మేరకు ప్రసాద్ సీడ్స్ చైర్మన్ కారుమంచి ప్రసాద్ ముఖ్యమంత్రిని కలిసి వివరించారు.
కొమ్మమూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం నిర్మాణానికి రూ.10 కోట్లు వితరణ ఇస్తామని చెప్పారు.
తద్వారా తమ సొంతూరు కాకుమాను గ్రామంతో పాటు ఆ చుట్టుపక్కల గ్రామాల్లో సాగు నీటి సమస్య పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.