Politics27th Jun 04:13 PMSunil Byrisetty1 min read

రేవంత్‌రెడ్డిపై పీకే సంచలన వ్యాఖ్యలు

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌రెడ్డి గతంలో బిహారీయులపై చేసిన వ్యాఖ్యలకు ఆ పార్టీ అగ

రేవంత్‌రెడ్డిపై పీకే సంచలన వ్యాఖ్యలు
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌రెడ్డి గతంలో బిహారీయులపై చేసిన వ్యాఖ్యలకు ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీయే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. బిహార్ ప్రజలపై మాట్లాడిన రేవంత్‌రెడ్డిపై ముందు రాహుల్‌గాంధీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్.. బిహార్‌ సలహాదారులు, అధికారులను పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీయించారని, కూలిపనులు చేయడం బిహార్ ప్రజల డీఎన్ఏలోనే ఉన్నదని రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రశాంత్ కిశోర్ గుర్తు చేశారు. త్వరలో జరిగే బిహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను ఖండించకుండా రాహుల్‌గాంధీ ఏ ముఖం పెట్టుకొని బిహార్‌లోకి అడుగు పెడతారని ప్రశాంత్ కిషోర్ ప్రశ్నించారు.
Telangana News
Revanth Reddy
Prashant Kishor
Bihar Comments Controversy
Rahul Gandhi
Bihar Politics
jan suraaj
Scroll for the next article