Politics22nd Nov 05:34 PMSunil Byrisetty1 min read

స్థానిక సమరానికి సన్నాహాలు?

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగరా మోగించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమ వుతున్నట్లు తెలుస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం నుంచి సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన

స్థానిక సమరానికి సన్నాహాలు?
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగరా మోగించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమ వుతున్నట్లు తెలుస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం నుంచి సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం అందుకు ఏర్పాట్లు చేస్తోంది. 175 అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితాలు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాల యం నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకుంది. వీటి నుంచి మున్సిపల్, పంచా యతీల వారీగా ఓటర్ల జాబితాలు సిద్ధం చేయనున్నారు. ఇందుకోసం మున్సిపల్, పంచాయతీల్లో మాస్టర్ ట్రైనీలకు శిక్షణ ఇచ్చారు. ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేసిన వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలన్న యోచనతో ఎన్నికల సంఘం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ నీలం సాహినిని పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి నారాయణ శుక్రవారం కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Andhra Pradesh
Local Body Elections
SEC
Voter Lists
Reservations
AP Politics
Municipal Elections
Panchayat Elections
Neelam Sahini
Minister Narayana
ఎన్నికల సంఘం
ఓటర్ల జాబితాలు
రిజర్వేషన్లు
Scroll for the next article