News23rd Dec 02:41 PMSunil Byrisetty1 min read

సారస్ కు ముమ్మర ఏర్పాట్లు

సారస్ (SARAS - Sale of Articles of Rural Artisans Society -సేల్ ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ రూరల్ ఆర్టిసన్స్ సొసైటీ) ప్రదర్శన శాలకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. జనవరి 3వ తేదీ నుండి 15వ త

సారస్ కు ముమ్మర ఏర్పాట్లు
సారస్ (SARAS - Sale of Articles of Rural Artisans Society -సేల్ ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ రూరల్ ఆర్టిసన్స్ సొసైటీ) ప్రదర్శన శాలకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. జనవరి 3వ తేదీ నుండి 15వ తేదీ వరకు గుంటూరు కాకాని రోడ్ లో మణిపురం బ్రిడ్జి దగ్గరలో గల గ్రీన్ లీఫ్ టొబాకో త్రెషోల్డ్ ప్రాంగణంలో ప్రదర్శన శాలల ఏర్పాటుకు వేదికగా నిర్ణయించారు. పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్న ఈ ఎగ్జిబిషన్లో ఆంధ్రప్రదేశ్ తో పాటు అనేక రాష్ట్రాల నుంచి సుమారు 6 వందల మంది స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొంటున్నారు. మొత్తం 250 స్టాళ్లలో హ్యాండ్లూమ్స్, హ్యాండిక్రాఫ్ట్స్, చీరలు, షాల్స్, కార్పెట్లు, బెడ్ షీట్ లు, వెదురు, లోహ, గాజు ఉత్పత్తులు, సాంప్రదాయ, ఆర్గానిక్ ఆహార పదార్థాలు, ఆభరణాలు, గృహ అలంకరణ వస్తువులు, ఆహార పదార్థాలు వంటి ఉత్పత్తులు ప్రదర్శన, విక్రయం జరుగుతుంది. రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ గుంటూరు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సౌజన్యంతో దీనిని నిర్వహిస్తుంది. స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు మార్కెట్ అవకాశాలు కల్పించడం, వారి ఆదాయ వనరులు పెంపొందించడం, గ్రామీణ మహిళల జీవనోపాధిని బలోపేతం చేయడం ఈ ప్రదర్శన యొక్క ప్రధాన ఉద్దేశ్యం.
Andhra Pradesh
SARAS Exhibition
Rural Artisans
Self Help Groups
Women Empowerment
Handlooms
Handicrafts
Guntur
ఎస్‌హెచ్‌జీ మహిళలు
ఆర్గానిక్ ఉత్పత్తులు
హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్
సారస్ మేళా
Scroll for the next article