National11th Aug 03:40 PMSunil Byrisetty1 min read
సిఎస్‌లతో కేబినెట్ కార్యదర్శి వీడియో సమావేశం
త్వరలో జరగనున్న 5వ జాతీయ చీఫ్ సెక్రటరీల సమావేశం ఏర్పాట్లు, వివిధ చట్టాల డీ రెగ్యులేషన్ తదితర అంశాలపై ఢిల్లీ నుంచి కేబినెట్ కార్యదర్శి టివి.సోమనాధన్ వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన
త్వరలో జరగనున్న 5వ జాతీయ చీఫ్ సెక్రటరీల సమావేశం ఏర్పాట్లు, వివిధ చట్టాల డీ రెగ్యులేషన్ తదితర అంశాలపై ఢిల్లీ నుంచి కేబినెట్ కార్యదర్శి టివి.సోమనాధన్ వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు,కేంద్ర పాలిత ప్రాంతాల అడ్మినిస్ట్రేటర్లతో వీడియో సమావేశం నిర్వహించారు.సోమనాధన్ మాట్లాడుతూ త్వరలో జరగనున్న 5వ జాతీయ చీఫ్ సెక్రటరీల సమావేశానికి సంబంధించి ఏర్పాట్లలో భాగంగా గత సమావేశానికి చెందిన ఫీడ్ బ్యాక్ నివేదికలను కంపైల్ చేసి అప్లోడ్ చేయాలని సూచించారు.అలాగే రానున్న సమావేశానికి ప్రతి రాష్ట్రం నుంచి స్టేట్ స్పెసిఫిక్ అంశాలకు సంబంధించి 5 స్టేట్ స్పెసిఫిక్ నివేదికలను సమర్పించాలని అన్నారు. వివిధ నివేదికలను కంపైల్ చేసి అప్లోడ్ చేసేందుకు వీలుగా ఇంకా కొన్ని రాష్ట్రాలు నోడలు అధికారిని నియమించలేదని వెంటనే నియమించాలని ఆదేశించారు. దేశవ్యాప్తంగా వివిధ చట్టాల డీరెగ్యులేషన్ పర్యవేక్షణకు నియమించబడిన కేబినెట్ డీరెగ్యులేషన్ సెల్ ద్వారా ఇప్పటి వరకు చేపట్టిన చట్టాల సరళీకరణ ప్రక్రియను సమీక్షించారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ మాట్లాడుతూ ఇప్పటికే 21 అంశాలకు సంబంధించి నివేదికలను సమర్పించామని తెలిపారు.