News10th Nov 03:48 PMSunil Byrisetty1 min read

పీఏసీఎస్ ఎన్నికలకు ఏర్పాట్లు

చిత్తూరు జిల్లాలో 33 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (PACS) ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. రాష్ట్రంలో ప్రాథ

పీఏసీఎస్ ఎన్నికలకు ఏర్పాట్లు
చిత్తూరు జిల్లాలో 33 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (PACS) ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (PACS) పాలకవర్గాల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో సహకార శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లాలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లు ప్రారంభించారు. జిల్లాలోని 33 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించేందుకు సభ్యుల వివరాల సేకరణ, ఈ-కేవైసీ, ఓటర్ల జాబితాల తయారీ, నియోజకవర్గాల నిర్ధారణ, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, ఎన్నికల సామగ్రి సమకూర్చడం, సిబ్బందికి శిక్షణ తదితర అంశాలపై చర్యలు చేపడుతున్నారు. మంగళవారం స్థానిక జిల్లా సహకార అధికారి కార్యాలయంలో జిల్లా సహకార అధికారి ఎస్.లక్ష్మి సహకార శాఖ సిబ్బందితో సమావేశం నిర్వహించి, ఎన్నికలకు సంబంధించిన ముందస్తు ఏర్పాట్లపై సమీక్షించారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడేలోపు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు.
Scroll for the next article