News16th Sep 10:50 AMSunil Byrisetty1 min read
విజయవాడ ఉత్సవ్ సన్నాహక సమావేశం
విజయవాడ ఫార్చ్యూన్ మురళి హోటల్‌లో విజయవాడ ఉత్సవ్ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఉమ్మడి కృష్ణా జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు, కూటమి నాయకులు హాజరయ్య
విజయవాడ ఫార్చ్యూన్ మురళి హోటల్‌లో విజయవాడ ఉత్సవ్ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఉమ్మడి కృష్ణా జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు, కూటమి నాయకులు హాజరయ్యారు. 11 రోజులపాటు ఘనంగా జరగనున్న ఈ వేడుకలను ప్రజలతో మమేకం చేస్తూ నిర్వహించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. అంతరించిపోతున్న కళలను పరిరక్షిస్తూ, దసరా సందర్భంగా విజయవాడను పర్యాటక కేంద్రంగా నిలబెట్టేలా ఉత్సవాలను రూపొందిస్తున్నట్టు ఆయన చెప్పారు. ఈ ప్రయత్నాన్ని మైసూర్ ఫెస్ట్ తరహాలో జాతీయ స్థాయికి తీసుకెళ్లే దిశగా కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి స్పష్టం చేశారు.