Notifications11th Jul 11:26 AMSunil Byrisetty1 min read

ఎంబీబీఎస్ కౌన్సెలింగ్‌కు సిద్ధమవ్వండి

ఆంధ్రప్రదేశ్‌లో ఎంబీబీఎస్ కౌన్సెలింగ్‌కు వైద్యారోగ్య శాఖ సిద్ధమవుతోంది. రాష్ట్రంలో 2025-26విద్యా సంవత్సరానికి MBBS, BDS కన్వీనర్ కోటా సీట్ల భర్తీ కోసం త్వరలోనే కౌన్సెలింగ్‌కు నోటిఫ

ఎంబీబీఎస్ కౌన్సెలింగ్‌కు సిద్ధమవ్వండి
ఆంధ్రప్రదేశ్‌లో ఎంబీబీఎస్ కౌన్సెలింగ్‌కు వైద్యారోగ్య శాఖ సిద్ధమవుతోంది. రాష్ట్రంలో 2025-26విద్యా సంవత్సరానికి MBBS, BDS కన్వీనర్ కోటా సీట్ల భర్తీ కోసం త్వరలోనే కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్ వెలువడనుందని తెలిపింది, విద్యార్థులు అవసరమైన ధ్రువీకరణపత్రాలను సిద్దం చేసుకోవాలని హెల్త్ యూనివర్సిటీ సూచించింది. ఆన్లైన్ దరఖాస్తు సమయంలో కావాల్సిన ధ్రువీకరణ పత్రాల జాబితాను విడుదల చేసింది. ఈ పత్రాలను విద్యార్థులు ముందుగానే సిద్ధం చేసుకుంటే ఒత్తిడి ఉండదని తెలిపింది. నోటిఫికేషన్ విడుదలైన వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చని వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి తెలిపారు. అభ్యర్థులు గమనించాలని సూచించారు.
Andhra Pradesh
notification
AP neet 2025
MBBS counselling
NEET exam
Registration
Document Verification
Scroll for the next article