News6th Apr 11:43 AMSunil Byrisetty1 min read
వక్ఫ్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం.. ఇక చట్టమైంది!
దేశంలో విస్తృత చర్చకు దారి తీసిన వక్ఫ్ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. వాడీవేడీ వాదోపవాదాల తర్వాత ఇటీవలే వక్ఫ్ సవరణ బిల్లుకు పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం లభి
దేశంలో విస్తృత చర్చకు దారి తీసిన వక్ఫ్ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు.
వాడీవేడీ వాదోపవాదాల తర్వాత ఇటీవలే వక్ఫ్ సవరణ బిల్లుకు పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం లభించింది.
మరోవైపు వక్ఫ్ సవరణ బిల్లుపై కాంగ్రెస్, ఎంఐఎం, ఆప్ పార్టీలు న్యాయపోరాటానికి దిగాయి.
ఈ బిల్లును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. బిల్లుని వ్యతిరేకిస్తూ వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశాయి.
అయితే ఈ బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ప్రభుత్వం పేర్కొంది.
వక్ఫ్ ఆస్తుల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయడంతోపాటు వక్ఫ్ ఆస్తులపై ఆక్రమణలను ఆపే బిల్లు అని స్పష్టం చేసింది.