News14th Oct 04:10 PMSunil Byrisetty1 min read
రాష్ట్రపతి చేతుల మీదుగా సరస్ మేళా ప్రారంభోత్సవం
విజయవాడ( పున్నమి ఘాట్ / సరస్ మేళ )విజయవాడలో కృష్ణా నది తీరాన పున్నమి ఘాట్లో నిర్వహించనున్న జాతీయ స్థాయి సరస్ మేళా ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మ
విజయవాడ( పున్నమి ఘాట్ / సరస్ మేళ )విజయవాడలో కృష్ణా నది తీరాన పున్నమి ఘాట్లో నిర్వహించనున్న జాతీయ స్థాయి సరస్ మేళా ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తో కలిసి విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని సరస్ మేళా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ నెల 15న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా సరస్ మేళా ప్రారంభోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 480 స్వయం సహాయక సంఘాలకు చెందిన ఉత్పత్తులతో సరస్ మేళాను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహిళా స్వయం సహాయక సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులకు జాతీయ స్థాయిలో మార్కెటింగ్ అవకాశాలు కల్పించడమే ఈ మేళా ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. మహిళలు ఉత్పత్తుల తయారీలోనూ, వాటి విక్రయాల్లోనూ స్వయం సమృద్ధి సాధించేలా ప్రోత్సహించాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన అని వెల్లడించారు.