National9th Sep 04:29 PMSunil Byrisetty1 min read
ఏఐకి సిద్ధంగా ఉండాలి.. ప్రధాని కీలక సూచన
ప్రపంచ ఉద్యోగ మార్కెట్ కు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొత్త సవాళ్లు విసురుతోంది. ఏఐ నైపుణ్యాలను నేర్చుకోకుంటే యువతకు భవిష్యత్ కష్టమేనని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ
ప్రపంచ ఉద్యోగ మార్కెట్ కు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొత్త సవాళ్లు విసురుతోంది. ఏఐ నైపుణ్యాలను నేర్చుకోకుంటే యువతకు భవిష్యత్ కష్టమేనని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక సూచనలు చేశారు. ఏఐ యుగానికి యువత సిద్ధంగా ఉండాలన్నారు. ఏఐ నైపుణ్యాలు కేవలం ఐటీ రంగానికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో ఉపయోగించుకోవాలని సూచించారు. సౌర రంగం విస్తరణతో యువతకు కొత్త ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని, రూఫ్‌టాప్ సోలార్ విస్తరణతో కుటుంబాలు విద్యుత్ ఉత్పత్తిదారులుగా మారుతున్నారన్నారు.