National12th Jan 03:50 PMSunil Byrisetty1 min read

మారనున్న ప్రధాని మోదీ చిరునామా

ప్రధాని మోదీ కార్యాలయం చిరునామా మారుతోంది. సెంట్రల్ విస్టా రీడెవలప్‌మెంట్ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అత్యాధునిక కార్యాలయ భవన సముదాయంలోకి మోదీ మారనున్నారు. సంక్రాంతి అనంతరం ఆయన

మారనున్న ప్రధాని మోదీ చిరునామా
ప్రధాని మోదీ కార్యాలయం చిరునామా మారుతోంది. సెంట్రల్ విస్టా రీడెవలప్‌మెంట్ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అత్యాధునిక కార్యాలయ భవన సముదాయంలోకి మోదీ మారనున్నారు. సంక్రాంతి అనంతరం ఆయన కొత్త కార్యాలయంలోకి ప్రవేశించవచ్చని ప్రభుత్వ వర్గాల సమాచారం. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఢిల్లీలోని సౌత్ బ్లాక్‌ నుంచే పీఎంవో కార్యకలాపాలు సాగుతున్నాయి. ఈ కొత్త భవన సముదాయానికి 'సేవా తీర్థ్' అని ప్రభుత్వం నామకరణం చేసింది. ఇందులో మొత్తం మూడు భవనాలు ఉన్నాయి. 'సేవా తీర్థ్-1'ను పీఎంవో కోసం, 'సేవా తీర్థ్-2'ను కేబినెట్ సెక్రటేరియట్ కోసం, 'సేవా తీర్థ్-3'ను జాతీయ భద్రతా మండలి కోసం కేటాయించారు.
Prime Minister Modi
PMO Office
Central Vista Project
New PMO Building
Seva Teerth
ఢిల్లీ
కేబినెట్ సెక్రటేరియట్
జాతీయ భద్రతా మండలి
కేంద్ర ప్రభుత్వం
Scroll for the next article